కోదాడ డీఎస్పీ, మున్సిపల్ చైర్మన్కు TJWA ఆహ్వానం
కోదాడ, అక్టోబర్ 4 – సందేశం టైమ్స్ ప్రతినిధి: తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (TJWA) ఆధ్వర్యంలో ఈ నెల 25న కోదాడలో నిర్వహించనున్న జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం, శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గార్లను TJWA ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం, వృత్తిపరమైన బాధ్యతలు, సమాజం పట్ల మీడియా పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా TJWA జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ కోశాధికారి కాసే అమృత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జె. కోలా, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు విశాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.