తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ – కోదాడ నియోజకవర్గ కమిటీ నియామకాలు
కోదాడ, సందేశం టైమ్స్ : తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ స్థాయి కమిటీని నూతనంగా రూపకల్పన చేయనున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక సీఈవో శెట్టి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ఆసక్తి కలిగిన వర్కింగ్ జర్నలిస్టులు ఈ కమిటీలోని వివిధ కీలక హోదాలలో చేరి, పాత్రికేయుల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ జర్నలిస్ట్ నాయకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అసోసియేషన్ బలోపేతానికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి భాగస్వాములు కావాలనుకునే మిత్రులు మరియు విలేకరులు వెంటనే సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వం మరియు ఇతర వివరాల కోసం 9052045435 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు.