News

మరవెల్లిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

August 17, 2026
By B. sangameshwar

వట్పల్లి, సందేశం టైమ్స్ ప్రతినిధి ఆగస్టు 16: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలంలోని మరవెల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చిన్నపట్ల మల్లేశ్వరమ్మ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణ, అంబేద్కర్ చౌక్, సీసీఐ చర్చి, రైతు వేదిక, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఆటపాటలు, ప్రసంగాలతో ఆకట్టుకోగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play