News

వట్పల్లి డాన్ బాస్కో పాఠశాలలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

August 15, 2026
By B. sangameshwar

వట్పల్లి, ఆగస్టు 15 (సందేశం టైమ్స్ ): అందోల్ నియోజకవర్గం లోని వట్పల్లి మండల కేంద్రంలోని డాన్ బాస్కో పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గౌరవాన్ని చాటుకున్నారు.

వేడుకల్లో విద్యార్థులు దేశభక్తి ప్రసంగాలు, ఆటల పోటీలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ, బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play