కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా పోటీలు
స్టూడెంట్ రిపోర్టర్ ఎస్.కె. హబీబా | ఆగస్టు 12: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, శారీరక దారుఢ్యం, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు కళాశాల యాజమాన్యం ఈ పోటీలను నిర్వహించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.