Suryapet

గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ పటిష్టం. సరిహద్దు ప్రాంతంపై నిఘా.సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

June 18, 2026
By 9640531073

సందేశం టైమ్స్ కోదాడ రూరల్ జూన్ 18-
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ*
పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు విచ్చేసిన ఎస్పీ గారికి కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ఐ గోపాల్ మరియు పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ గారు పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం, పోలీస్ సామాగ్రిని (కిట్లను) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది అంతా కలిసికట్టుగా పని చేస్తూ.. స్థానిక సమస్యలు, కార్యకలాపాలపై వేగంగా సమాచారం సేకరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కేసుల దర్యాప్తులో వేగంగా నైపుణ్యంతో పని చేయాలి, మండల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, దర్యాప్తు స్థితిగతులు, కోర్టు కేసుల రికార్డులను ఎస్పీ గారు నిశితంగా పరిశీలించారు. కేసులు, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని, పోలీసు సేవల్లో వృత్తి నైపుణ్యం చూపాలని అన్నారు. స్టేషన్ రిసెప్షన్ సెంటర్ పనితీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అత్యంత గౌరవంగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి మెరుగైన పోలీసు సేవలు అందించి భరోసా కల్పించాలని సిబ్బందికి సూచించారు.
*సరిహద్దుపై పటిష్ట నిఘా:* కోదాడ ప్రాంతం తెలంగాణ – ఆంధ్ర రాష్ట్రాలకు ముఖద్వారంగా, సరిహద్దుగా ఉన్నందున అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని స్పష్టం చేశారు.
*దొంగతనాల నివారణ*: మండల పరిధిలో గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోలీసు నిఘా ఉంచాలి, రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాల నివారణకు కృషి చేయాలి అన్నారు.
*మహిళల భద్రతకు ప్రాధాన్యం:* మహిళల భద్రతలో పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలు, విద్యార్థులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, వేధింపులపై డయల్ 100, 112 కు సమాచారం ఇవ్వాలి..ఇంటికి వచ్చి పిర్యాదులు తీసుకుని ఇంటి నుండే కేసులు నమోదు చేస్తున్నాము.
*రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ:* రహదారుల వినియోగంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అన్నారు. రోడ్డు భద్రత పట్ల పోలీసు విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని అన్నారు.
*నేరస్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ:* రౌడీ షీటర్లు, అలవాటుగా నేరాలకు పాల్పడే పాత నేరస్తుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వీరి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది ఎప్పటికప్పుడు నమోదు చేయాలి, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ, నిఘా ఉంచాలని అన్నారు.
*గ్రామ పోలీసులదే కీలక పాత్ర:** నేరాల నియంత్రణలో మరియు సమాచార సేకరణలో “గ్రామ పోలీస్ అధికారి” వ్యవస్థ అత్యంత కీలకంగా వ్యవహరించాలని, ఈ వ్యవస్థ మరింత పటిష్టంగా పని చేయాలని ఎస్పీ గారు అన్నారు.
షీ టీం కార్యాలయం, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను పరిశీలించారు. మహిళల భద్రతా విద్యార్థుల భద్రత పట్ల చట్టాల అమలుపట్ల కళాశాలలో కాలనీలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని షీ టీం సిబ్బందికి సూచించారు. కోదాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సామాన్య ప్రజలకు వాహనదారులకు రోడ్లపై సమస్యలు ఎదురవకుండా చూడాలని అన్నారు.
ఇతనికి ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి, డిసిఆర్బి సిఐ మగ్దుం అలి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్, షీ టీం ఎస్ఐ మల్లేశం, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డి సి ఆర్ పి సిబ్బంది ఏఎస్ఐ అంజన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, ఎస్పి సిసి సందీప్ ఉన్నారు

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play