News

మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులర్పించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

April 11, 2026
By David B

మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో ఏర్పాటుచేసిన పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని ఆయన యొక్క ఆలోచనలను ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చైతన్య పరచడంతో పాటు వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న సమూన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ శివానందం, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నియర్ నాయకుల రుద్రారం శంకర్, వెంకటేష్, శ్రీరాములు, చంద్రశేఖర్, వివిధ దళిత సంఘాలు ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play