జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – మిషన్ భగీరథ కార్మికుల హెచ్చరిక
సందేశం టైమ్స్ నారాయణఖేడ్ ఏప్రిల్ 04ప్రతినిధి సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ తాలూకాలోని మిషన్ భగీరథ కార్మికులు పెండింగ్ జీతాల చెల్లింపునకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మానూర్ మండలం బోరంచ గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద శనివారం సమ్మెకు దిగిన కార్మికులు, గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసనను ఉధృతం చేస్తూ మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశామని పేర్కొన్నారు. జీతాలు వెంటనే చెల్లించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.