Khammam

*25 ట్రిపుల అక్రమ ఇసుక నిల్వ సీజ్*

June 16, 2026
By Setti Suresh

చింతకాని, ఖమ్మం జిల్లా: చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 25 ట్రిప్పుల ఇసుక కుప్పలను మండల రెవెన్యూ అధికారులు మంగళవారం ఉదయం సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకపై అందిన సమాచారంతో రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ ఏకవీర ఆధ్వర్యంలో ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక నిల్వలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play