Alerts

హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం: వాటర్ లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనర్

June 18, 2026
By SandeshamTimes

సందేశం టైమ్స్ హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్ లాగింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గురువారం రాత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ జోయల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ శ్రీ అవినాష్ కుమార్, ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని రహదారులపై నిల్వ ఉన్న నీటిని అత్యవసరంగా తొలగించాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సీపీ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షం తగ్గి రోడ్లపై నీటి నిల్వలు పూర్తిగా తొలగిపోయే వరకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలు తగ్గించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play