సీఎం సహాయానిది చెక్కుల పంపిణీ *
సంగారెడ్డి ఫిబ్రవరి 06 (సందేశం టైమ్స్:-పుల్కల్ మండలం ప్రతినిధి మహేష్ బాబు)
పుల్కల్ మండలం లోని
సీఎం సహాయ నిది తో పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గొంగ్లూర్ రాం చంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దాయి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు వరం అయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వారికి కుటుంబ పాలిట ఓ దైవంగా నిలుస్తుందని అన్నారు. మొత్తం విలువైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం లక్ష్మారెడ్డి, ఇసోజిపేట్ గోవర్ధన్, ముద్దాయి పేట కమల్ రెడ్డి, బగొంగ్లూర్ రామచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ ఎం ప్రవీణ శ్రీనివాస్. ఉప సర్పంచ్ పిజి సత్యనారాయణ, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ రాఘవేందర్ రెడ్డి, చంద్రయ్య, నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.