మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బందోబస్తు కు 350 మంది పోలీస్.
*ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 163 BNSS నిషేద ఆజ్ఞలు అమలు. (144 సెక్షన్ అమలు).*
*విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేదం*
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 350 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిషిద్ధ ఆజ్ఞలు అమలులో ఉంటాయి అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163 BNSS (144 సెక్షన్ అమలు) అమలు చేస్తున్నామని అన్నారు. ఈ యొక్క 163 BNSS సెక్షన్ రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదని అన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్