మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్లు
హైదరాబాద్, అక్టోబర్ 10 – సందేశం టైమ్స్ ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుతో పాటు హైకోర్టులోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 10 నుంచి 15 మంది గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు) రాష్ట్ర మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ వేతనాలను పెంచాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న బాధ్యతలు, న్యాయపరమైన సేవలను దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని వారు మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్లు సమర్పించిన వినతిపత్రాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టుకు చెందిన పలువురు ప్రభుత్వ న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.