Suryapet

భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మోదీ 12 ఏళ్ల సుపరిపాలన: బిజెపి నాయకులు

June 16, 2026
By 9640531073

కోదాడ రూరల్, సందేశం టైమ్స్ (జూన్ 16):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బిజెపి నాయకులు కనగాల నారాయణ, దేవరశెట్టి సత్యనారాయణ, ఎరగాని రాధాకృష్ణ, కళావతిలు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం “సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్” అనే నినాదంతో దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని కొనియాడారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, మరియు మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేసిందని గుర్తుచేశారు.అమలైన ముఖ్యమైన సంక్షేమ పథకాలు:ప్రధానమంత్రి జన్ ధన్ యోజన: కోట్లాది మంది పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.ప్రధానమంత్రి ఉజ్వల యోజన: అర్హులైన పేద కుటుంబాల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించింది.ఆయుష్మాన్ భారత్: పేద ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలతో కొండంత ఆరోగ్య భద్రతను కల్పించింది.ప్రధానమంత్రి ఆవాస్ యోజన: సొంత ఇల్లు లేని లక్షలాది నిరుపేద కుటుంబాల కలలను సాకారం చేసింది.పీఎం కిసాన్ పథకం: దేశంలోని అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందిస్తూ ఆర్థికంగా అండగా నిలిచింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ పథకాల ఫలితాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకు దూసుకుపోతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play