News

చౌటకూర్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

August 17, 2026
By B. sangameshwar

సంగారెడ్డి /ఆగష్టు16 సందేశం టైమ్స్
చౌటకూర్ మండల్ రీపోటర్
డి రమేష్
సంగారెడ్డి జిల్లా

విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు, స్టీల్ గ్లాసుల పంపిణీ..
కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ పార్కల రాంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.అనంతరం మండల పరిషత్ ప్రాథమిక (ఎంపీపీ) పాఠశాలలో విద్యార్థులు అంబలి తాగేందుకు వీలుగా స్టీల్ గ్లాసులను అందజేయడంతో పాటు, నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ అనురాధ, ఎమ్మార్వో నామాల కిష్టయ్య, ఎంపీడీవో శంకర్, సర్పంచ్ పార్కల రాంరెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో గ్రామ వార్డు సభ్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play